సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు మరో సవాల్ విసిరారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి రాజీనామా లేఖతో వస్తా అని నువ్వు వస్తావా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోపు హామీలు అమలు చేస్తే స్పీకర్ కు నా రాజీనామా లేఖ ఇవ్వండి. ఒకవేళ హామీలు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వాలి అని సవాల్ విసిరారు. ఈ సవాల్ పై రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉంది.