మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చావు కబురు చల్లగా చెప్పిండు. రాష్ట్ర రైతులను మోసం చేసిన రేవంత్ ముక్కు నేలకు రాయాలి. మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా?’ అని ‘X’ వేదికగా ప్రశ్నించారు.