Homeహైదరాబాద్latest NewsHarish Rao : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదు.. ప్రాంత ప్రయోజనాలకు...

Harish Rao : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదు.. ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదు.. హరీష్ రావు ఫైర్..!!

Harish Rao : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది అని బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు (Harish Rao) అన్నారు. 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు అని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ గారూ, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం అని అన్నారు. ఈ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా.. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది అని అన్నారు.తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు అని నిలదీశారు. తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది అని పేర్కొన్నారు.
కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయింది. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది అని అన్నారు. తీరిగ్గా తేరుకొని, బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అని ప్రశించారు. బిజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయింది అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు..

Recent

- Advertisment -spot_img