Homeరాజకీయాలుఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుండ్రు

ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుండ్రు

– కాంగ్రెస్​ గెలిస్తే ఢిల్లీ, కర్నాటక నుంచి తెలంగాణను కంట్రోల్​ చేస్తారు
– మీదే సక్కగ లేదు మాకొచ్చి నీతులు చెప్తారా?
– మంత్రి హరీశ్​రావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుండ్రు అని మంత్రి హరీశ్​రావు విమర్శలు గుప్పించారు. శుక్రవారం హైదరాబాద్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకుండా ఇక్కడికొచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారని హరీశ్​రావు ప్రశ్నించారు. కర్ణాటకలో 5 గంటలే కరెంట్​ ఇస్తున్నామని డీకే శివకుమారే స్వయంగా ఒప్పుకున్నారని, ముందు మీ ఇళ్లు సక్కదిద్దుకోవాలని, ఆ తర్వాత మాకొచ్చి నీతులు చెప్పండి అని నిలదీశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తెలంగాణను ఢిల్లీలో, కర్నాటక నుంచి కంట్రోల్ చేస్తారన్నారు. ఆ పార్టీలో టికెట్లు కావాలంటే ఢిల్లీకి, డబ్బులు కావాలంటే కర్నాటకు, ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు రావాల్సి ఉంటుందని ఎద్దేనా చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్​తోనే జరుగుతుందని, ఆయనతోనే తెలంగాణ రక్షణ సాధ్యం అవుతుందన్నారు.

Recent

- Advertisment -spot_img