గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్ రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్ ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో కాంగ్రెస్ మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో యువతకు పిలుపునిచ్చారు.