Homeహైదరాబాద్latest News'మిస్టర్ బచ్చన్' మూవీపై రానా కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్

‘మిస్టర్ బచ్చన్’ మూవీపై రానా కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్

అబుదాబిలో జరిగిన IIFA-2024 వేడుకల్లో హీరో దగ్గుబాటి రానా చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జతో కలిసి రానా ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షోలో రానా హద్దులు దాటి రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాపై కొన్ని కామెంట్స్ చేసాడు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలై డిజాస్టర్‌గా నిలించింది.
ఈ షోలో రానా,తేజ సజ్జ హోస్ట్‌ చేస్తూ… ”బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై.. లోయెస్ట్ లో చూశారు” అని రానా అనగా.. పక్కనే ఉన్న సజ్జా ”హైయెస్ట్ హై ‘కల్కి’ సినిమా .. మరి లోయెస్ట్ లో ఏంటి?” అని తేజ ప్రశ్నించాడు. దాంతో రానా వెటకారంగా ”అదే ఆమధ్య రిలీజైంది కదా.. మిస్టర్..? ” అంటూ సాగదీశాడు. దాంతో తేజ సజ్జా చెప్పొద్దంటూ ఆపేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హరీశ్ శంకర్ వరకూ చేరింది.ఈ వ్యహారంపై రవితేజ అభిమాని ఒకరు హరీష్ శంకర్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘‘నువ్వు మళ్లీ రవితేజ అన్నతో సినిమా చేయాలి.. మేము కాలర్ ఎగురవేయాలన్నా ? మాకు మీ సమాధానం కావాలి” అని రాశారు. ఈ విషయంపై హరీష్ శంకర్ కూడా స్పందించారు. “ఎన్నో …విన్నాను తమ్ముడు …అందులో ఇదోటి.. అన్ని రోజూలు ఒకేలా ఉండవు.. నాకైనా.. ఎవరికైనా .. అంటూ హరీష్ శంకర్ కాస్త ఘాటుగా స్పందించాడు.

Recent

- Advertisment -spot_img