HomeతెలంగాణHarish Shankar : హీరో రాడు.. హీరోయిన్ అవుట్.. ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..?

Harish Shankar : హీరో రాడు.. హీరోయిన్ అవుట్.. ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..?

Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) పేరు వినగానే ”గబ్బర్ సింగ్” సినిమా, ”మిరపకాయ్” సినిమాలు గుర్తుకు వస్తాయి. హరీష్ శంకర్ తన సినీ కెరీర్ ని రవితేజ సినిమా ”షాక్” మూవీతో మొదలు పెట్టి పవన్ తో ”గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసాడు. ఈ సినిమాతో హరీష్ శంకర్ పేరు టాలీవుడ్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. దాంతో ఆ వెంటానే ఎన్టీఆర్ కలిసి తీసిన ”రామయ్యా వస్తావయ్యా” పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత తీసిన ”సుబ్రమణ్యం ఫర్ సేల్”, ”దువ్వాడ జగన్నాథం”, ”గద్దలకొండ గణేష్” సినిమాలు అవేరేజ్ గా ఆడాయి. ఇటీవలే రవితేజ హీరోగా ”మిస్టర్ బచ్చన్”అనే సినిమా తీసాడు. అది కాస్త డిజాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం పవన్ కళ్యణ్ తో ”ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా తీస్తున్నాడు. కానీ అది రిలీజ్ అవుతుంది అని నమ్మకం లేదు. ఎందుకంటే పవన్ కళ్యణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అసలు ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి శ్రీలీల తప్పుకునట్లు సమాచారం. శ్రీలీలతో ఒకటీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఇంకా షూటింగ్ మొదలు కాకపోవడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ పరిస్థితి ఏంటి అన్ని నెటిజన్స్ అంటున్నారు.

Recent

- Advertisment -spot_img