లాభసాటి వ్యవసాయమని, అన్ని పంటలకు బోనస్ అని, హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితికి రైతును దిగజార్చిన రేవంత్ సర్కార్. బోనస్ బోగస్ అయ్యింది. కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలి అని, రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.