Homeహైదరాబాద్latest Newsయూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో హరితహారం కార్యక్రమం.

యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో హరితహారం కార్యక్రమం.

ఇదేనిజం, శేరిలింగంపల్లి: యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ మల్లయ్య కుంట చెరువు వద్ద శనివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసి కాలనీ వాసులతో కలిసి వాకింగ్ ట్రాక్ చుట్టూ 60 మొక్కలు నాటారు. అనంతరం చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. కాలనీ వాసి పద్మారావు మాట్లాడుతూ… కాలనీ లు శుభ్రంగా ఉండాలంటే స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్వచ్చ కాలనీలుగా తీర్చుదిద్దవచ్చన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, దక్షిణామూర్తి , ఆంజనేయులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img