Homeఅంతర్జాతీయంHaryana:చెట్లకు కూడా పింఛన్‌

Haryana:చెట్లకు కూడా పింఛన్‌

Haryana:మనుషులకే ఫించన్‌ రావడం లేదంటే చెట్లకు ఫించన్‌ ఇస్తారట . నమ్మలేక పోతున్నారు కదూ ..అవును ముమ్మాటికీ ఇదే నిజం 75 ఏళ్లు దాటిన చెట్లకు హర్యానా ప్రభుత్వం ఫించన్‌ ప్రకటించింది. వృక్షాలకు పెన్షన్‌ ప్రథకం కింద ఏడాదికి రూ.2,500 ఇవ్వనున్నట్లు హర్యాణా అటవీశాఖ మంత్రి కన్వర్‌ పాల్‌ గుర్జర్‌ ప్రకటించారు.
వృద్ధులను కాపాడినట్లు 75 ఏళ్లు దాటిన చెట్లను కాపాడుకోవల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అటవీ సంపద తరిగిపోతోందని, రోడ్ల విస్తరణ పేరుతో మహావృక్షాలు విచక్షణారహితంగా కొట్టిపారేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పచ్చదనం కరువై కాలుష్యం పెరుగుతోందన్నారు. అందుకే చెట్లను కాపాడేందుకు ‘ప్రాణవాయు దేవత యోజన’ కింద ఓ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ పథకం కింద వృద్ధులకు పెన్షన్‌ మాదిరే 70 ఏళ్లు పైబడ్డ పురాతన వృక్షాలకు పెన్షన్‌ ఇవ్వనన్నారు. పురాతన చెట్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా 3,300 పురాతన వృక్షాలు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించింది. ఈ వృక్షాలన్నీ 75 ఏళ్లు పైబడ్డవే. ఈ పురాతన వృక్షాలను కాపాడేందుకు ఆ రాష్ట్ర సర్కార్ పింఛన్‌ పథకాన్ని తెచ్చింది. చెట్లను రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, చెట్లు లేకుంటే మానవ మనుగడ కష్టమవుతుందని హర్యాణా ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ పథకం పట్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

Recent

- Advertisment -spot_img