అత్యంత ప్రసిద్ధ దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరు. కొత్త కథాంశాలు, పాత్రలతో కథలను రూపొందించి జీవితాశయంగా సినిమాను తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు సెల్వరాఘవన్ సిద్ధహస్తుడు. సెల్వరాఘవన్ ప్రస్తుతం హీరో జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘మెంటల్ మది’లో సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గతంలో ‘7G రెయిన్‌బో కాలనీ’ రెండో భాగానికి దర్శకత్వం వహిస్తానట్లు ప్రకటించారు. తొలిభాగంలో హీరోగా నటించిన రవికృష్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా 2వ భాగం షూటింగ్ మధ్యలో ఆగిపోయింది.ఈ సినిమా సగంలో ఆగిపోవడానికి దర్శకుడు సెల్వరాఘవన్, హీరో రవికృష్ణల ఇగోలే కారణమని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.