“రాజీవ్ యువ వికాసం” పథకం కింద దరఖాస్తుల స్వీకరణకు ఇంకా వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ పథకానికి ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో గడువు ముగియనుండగా.. మొత్తంగా 20 లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మే 31లోగా అర్హులను స్కీనింగ్ చేసి కలెక్టర్ల ఆమోదానికి అధికారులు పంపనున్నారు. జూన్ 2న అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. లబ్దిదారులకు గరిష్టంగా రూ.4 లక్షల సాయం అందనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కోసం దరఖాస్తుల గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.