‘ము.. ము.. ము.. ముద్దంటే చేదా… నీకావుద్దేశం లేదా?’. ముద్దుని స్వీట్‌తో పోలుస్తారు. తమకి నచ్చినవారిని, తాము ఇష్టపడినవారికి ప్రేమను తెలియపరిచేందుకు వారి భాగస్వాములు ఓ ముద్దు ఇస్తారు. అయితే మీరెప్పుడైనా ముద్దుల వ్యాధి గురించి విన్నారా.! ఏంటి.? అలాంటి ఓ డిసీజ్ కూడా ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్(Mononucleosis Disease) అని అంటారు. దీన్ని చాలామంది కిస్సింగ్ వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది.
కిస్సింగ్ డిసీజ్ లక్షణాలు ఇవే:
కిస్సింగ్ డిసీజ్ తో బాధపడుతున్న వ్యక్తి అనేక వారాల పాటు వారి రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోవచ్చు. ఇన్ఫెక్షన్ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటాయి. అలసట, గొంతు నొప్పి, జ్వరం, మెడ మరియు చంకలలో వాపు, శోషరస గ్రంథులు వాపు, టాన్సిల్స్, తలనొప్పి, చర్మ దద్దుర్లులాంటివి కూడా ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న వారు ఎవరినీ ముద్దు పెట్టుకోకండి. మీ ఆహారం, ప్లేట్, గ్లాస్ ఎవరితోనూ పంచుకోవద్దు. రస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మీ చేతులను క్రమం తప్పకుండా కడగాలి.
కిస్సింగ్ వ్యాధికి చికిత్స:
కిస్సింగ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే చికిత్స, మందుల కోసం వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవాలు ఎక్కువగా తాగాలి. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మంది వ్యక్తులు రెండు నుంచి నాలుగు వారాల్లో కోలుకుంటారు. కొందరు వ్యక్తులు చాలా వారాల పాటు అలసిపోయినట్లు భావిస్తారు. అరుదైన సందర్భాల్లో, లక్షణాలు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు.