నటుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి పోస్టర్ విడుదలైంది. హీరోయిన్ దిశాపటానీ బర్త్‌డే సందర్భంగా ఆమె పోస్టర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ‘రాక్సీ’ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ రిలీజ్ కానుంది.