ఈరోజు సోషల్ మీడియా సూపర్ స్టార్, ఇంటర్నెట్ ఐకాన్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన మార్క్ జుకర్‌బర్గ్ పుట్టినరోజు. సీఈవో హోదాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజంగా ఎదిగిన ఫేస్‌బుక్ కంపెనీకి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. నేటితో ఆయన 40ఏళ్లలోకి అడుగుపెట్టారు. జుకర్‌బర్గ్ పూర్తి పేరు మార్క్ ఇలియట్ జుకర్‌బర్గ్. ఆయన మే 14, 1984న జన్మించారు. అతను వైద్యుల కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే.
అయితే ఫేస్‌బుక్ ‘బ్లూ’ రంగులో ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.. జుకర్ బర్గ్ కు బ్లూ పై అమితమైన ఇష్టముండడమో లాంటి కారణాలేవి లేవు. ఆయనకు కలర్ బ్లైండ్ నెస్ వల్ల ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులను జుకర్ బర్గ్ అసలు గుర్తించలేరు. ఆయనకు సంబంధించి బ్లూ మాత్రమే రిచెస్ట్ కలర్. బ్లూని మాత్రమే ఆయన స్పష్టంగా చూడగలరు. అందుకే ఫేస్ బుక్ ను బ్లూ కలర్ లో ఉండేలా రూపొందించారు. ఇంటి గోడల రంగులు కూడా బ్లూ రంగులోనే ఉండేలా చూసుకుంటారట జుకర్. ఒక్క కిచెన్ కు మాత్రం పసుపు రంగు పేయింటింగ్ వేయించారట.