ఐపీఎల్-2024 సీజన్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. చెపాక్ వేదికగా జరగనున్న ఫైనల్‌లో ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. బలాబలాలతో సమానంగా ఉన్న ఇరు జట్లు ఫైనల్‌లో ఫేవరెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో చేపాక్ వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజీ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే నేడు SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బర్త్ డే . సరిగ్గా ఆయన పుట్టినరోజునే ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. దీంతో ఫైనల్‌లో నితీశ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగి ఆడి SRHకు కప్పు సాధించి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 290 రన్స్ సాధించారు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది.