దర్శకుడు వశిష్ట దర్హకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా భారీ తెరకెక్కిస్తున్న చిత్రం“విశ్వంభర”. చాలా ఏళ్ల తర్వాత చిరు నుంచి భారీ ఫాంటసీ థ్రిల్లర్ గా వస్తుండగా, ఈ సినిమా నుంచిమేకర్స్ ఈ రోజు ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు త్రిష పుట్టినరోజు కానుకగా “విశ్వంభర” మూవీ నుంచి ఓ అందమైన పోస్టర్‌ని విడుదల చేశారు. బర్త్ డే విషెస్ తెలుపుతూ రివీల్ చేసిన ఈ పోస్టర్ లో త్రిష లుక్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. త్రిష అందంతో పాటు ఆమె కాస్ట్యూమ్ మరియు మెడ నగలు ఈ పోస్టర్ హైలైట్‌గా నిలిచాయి. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాలో త్రిష పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. మొత్తానికి త్రిష అభిమానులకు మేకర్స్ ట్రీట్ ఇచ్చారు అని చెప్పాలి.