విజయ్ దేవరకొండ కు “గీత గోవిందం” వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ తో మరోసారి “ఫ్యామిలీ స్టార్” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్ నటించింది. దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా ఓకే అనిపించింది. అయితే ఈరోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమాను మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు నిర్మించనున్న ఎస్వీసీ59 సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియాలో రిలీజ్ కానున్న ఈ సినిమాను రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్నారు.