తెలుగు చిత్రసీమలో ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన నటనతో అద్బుత అభినయంతో మహేష్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. దీంతో పాటు ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు కూడా చాలానే ఉన్నాయి. అయినా పబ్లిసిటీ చేసుకునే అలవాటు మహేష్ బాబుకు లేదు. అయితే సింపుల్‌గా అందరితో మంచిగా ఉండే మహేష్ బాబు అంటే అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు 40వ జన్మదినం సందర్బంగా మహేష్ అభిమానులు సోషల్‌మీడియాలో చేసిన హడావుడీ అంతా ఇంతా కాదు. మహేష్ బాబు పేరుతో శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో చేసిన #HBDMaheshbabu హాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది, ట్విట్టర్లో ఈ హాష్‌ట్యాగ్ ఏకంగా 33 మిలియన్లకు చేరువైంది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మహేష్ అంటే అభిమానులకు ఎంత అభిమానం అని. దీంతో ట్విట్టర్ హాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది.