HCU Land Dispute: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములపై నిజనిర్ధరణ నివేదిక పంపాలని తెలంగాణ అటవీశాఖను కేంద్రం ఆదేశించింది. కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపింది. అంతేకాకుండా అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. వాస్తవ నివేదిక, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఈ మేరకు కేంద్రం లేఖ రాసింది.