HCU : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం HCU భూ వివాదం సంచలనంగా మారింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని భూముల వేలం వివాదం కొనసాగుతోంది. అయితే 30 జేసీబీలతో HCUలోని చెట్లును సీఎం రెడ్డి ప్రభుత్వం తొలగించింది. తాజాగా HCU భూ వివాదంపై సినీ సెలెబ్రెటీలు స్పందిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ముందుగా దీనిపై ”కల్కి” మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మెస్తు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ‘మన ఖర్మ ఏమి చేస్తాం’ అంటూ నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు. ఆ 400 ఎకరాలు ఉన్న ఏరియా అనేది గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు.. గ్రీన్ ఏరియా అక్కడ చాలా వనరులు ఉన్నాయి.. అందుకే అక్కడ ఉన్న 400 ఎకరాల చెట్లును కొట్టకపోతే మనకే మంచింది అని నాగ్ అశ్విన్ అన్నారు.
తాజాగా ఈ ఘటనపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఈ విధ్వంసాన్ని తాను అంగీకరించలేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులు, పౌరులకు మాత్రమే తన మద్దతు ఉంటుందని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. మరోవైపు హీరోయిన్ ఈషా రెబ్బ, యాక్టర్ ప్రియదర్శి కూడా చర్యను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా విద్యార్థులు పోరాటానికి మద్దతు ఇచ్చారు. అలాగే రేణు దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్, యాక్టర్ అభినవ్ గౌతమ్ ఇలా చాలా మంది తమ గొంతును ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్నారు. దీంతో ఈ వివాదం సీఎం vs సెలెబ్రెటీస్ అన్నటుగా మారింది.