HDFC Bank Festival offers | హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫెస్టివ్ ఆఫర్లు.. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
పండుగల వేళ తన కస్టమర్లకు పలు ఆఫర్లు అందించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల మర్చంట్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
2020తో పోలిస్తే వివిధ రకాల కార్డులపై 10 వేల ఆఫర్లు అందిస్తున్నది. తద్వారా తేలికపాటి రుణ వాయిదాలపై రుణాలు మంజూరు చేయనున్నది.
గతేడాదితో పోలిస్తే 10 రెట్లు రాయితీలు అందించనున్నది.
ఇందుకోసం ఆపిల్, అమెజాన్, షాపర్స్ స్టాప్, ఎల్‌జీ, శామ్‌సంగ్, సోనీ, టైటాన్, సెంట్రల్, అజియో, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, లైఫ్ స్టైల్ తదితర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది.
ఐఫోన్ 13 కొనుగోలుపై రూ.6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఎలక్ట్రానిక్స్, కన్జూమర్ గూడ్స్ కొనుగోళ్లపై 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తోంది.
టూవీలర్స్ రుణాలపై 100 శాతం, ట్రాక్టర్ లోన్స్‌పై 90 శాతం నిధులు సమకూరుస్తుంది.
ఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.