Homeహైదరాబాద్latest NewsTSRTC బస్సుపై కత్తితో దాడి.. చివరకు..

TSRTC బస్సుపై కత్తితో దాడి.. చివరకు..

హైదరాబాద్ లో ఓ యువకుడు మద్యం మత్తులో చెలరేగిపోయాడు. ఎల్బీనగర్ ఓ ఆర్టీసీ బస్సుపై తాగిన మైకంలో రాళ్లతో దాడి చేశాడు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ కలిసి యువకుడిని ప్రశ్నించగా అగ్రహంతో వారిపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన కండక్టర్ అతిడి చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ దాడిని చూసిన ప్రయాణకులు, స్థానికులు భయాందోళను లోనయ్యారు. మద్యం మత్తులో ఉన్న యువకుడి కొందరు వచ్చి తీసుకుపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకుడి వివరాలు సేకరించాలని.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

Recent

- Advertisment -spot_img