ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు, హమాస్ లీడర్ యహా సిన్వర్ లను అరెస్టు చేసేందుకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ప్రయత్నిస్తోంది. కోర్టు ప్రాసిక్యూటర్ ఖాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అక్టోబర్ 7 న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులు, ప్రతిగా గాజాపై జరిపిన విధ్వంసాలకు సంబంధించిన కేసులో అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రితో పాటు మరో ఇద్దరు హమాస్ లీడర్లకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసేందుకు ఐసీసీ ప్రాసిక్యూషన్ టీం అడుగులేస్తోంది. ఖాన్ అప్లికేషన్‌ను ఐసీసీ ప్యానెల్ ఆఫ్ జడ్జెస్ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
గతంలో లిబియా నియంత గడాఫీ, రష్యా ప్రధాని పుతిన్‌పైనా ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది.