Homeహైదరాబాద్latest Newsఏకంగా శ్వేథసౌధం గేటునే గుద్దేశాడు..

ఏకంగా శ్వేథసౌధం గేటునే గుద్దేశాడు..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అంటే ప్రపంచంలోనే అత్యధిక భద్రత ఉండే ప్రదేశం. ఇక్కడ అడుగడుగునా భద్రత ఉంటుంది. అలాంటి శ్వేతసౌధం వద్ద ఆసక్తికర సంఘటన జరిగింది. 

వాషింగ్టన్ లో ఓ వ్యక్తి తన వాహనంతో వైట్ హౌస్ కాంప్లెక్స్ గేటును గుద్దేశాడు. వెంటనే స్పందించి వాషింగ్టన్ పోలీసులు ఆ వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది యాక్సిడెంటా, లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడి ఘటనా అనేది తేలాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో లేరు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. గతంలోనూ ఓ వ్యక్తి తప్ప తాగి గేటును గుద్దేశాడు.

Recent

- Advertisment -spot_img