Homeహైదరాబాద్latest Newsఇసుక ఉచితం అన్నారు..రవాణాకు అంత ధర ఎందుకు : బొత్స

ఇసుక ఉచితం అన్నారు..రవాణాకు అంత ధర ఎందుకు : బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే ఇప్పుడు ఇసుక ధర భారీగా పెరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని బొత్స అన్నారు. గతంలో టన్నుకు రూ.370 సీనరేజ్‌ ఉండేది, పది టన్నుల ఇసుక రూ.10 వేలకు దొరికేది, కానీ ఇప్పుడు విజయనగరంలో 10 టన్నుల ఇసుక రూ.14 వేలకు, విశాఖలో రూ.22 వేలకు ఇసుక ధర పెరిగింది అని బొత్స అన్నారు. విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అలాగే వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన రైల్వేజోన్‌ ఇవ్వాలి అని అయన అన్నారు. ప్రత్యేక హోదా చంద్రబాబు సాధించాలి అని బొత్స తెలిపారు. విశాఖ పోర్ట్‌లో డ్రగ్‌ కంటైనర్‌ కేసు ఏమైంది అని అయన ప్రశించారు, డ్రగ్‌ కంటైనర్‌పై సీఎం, డీజీపీ, సీబీఐకి లేఖ రాస్తాను అని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతా అని బొత్స అన్నారు.

Recent

- Advertisment -spot_img