ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. సెప్టెంబర్ 23న నవాబ్‌గంజ్‌లోని రామ్ జానకి ఆలయంలో 150 ఏళ్ల నాటి అష్టధాతువు రాధా కృష్ణ విగ్రహం చోరీ అయ్యింది. ఓ దొంగ గుడి తలుపు తాళం పగులగొట్టి విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. దీంతో ఆలయ పూజారి విగ్రహం కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. ఈ క్రమంలో విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ.. క్షమాపణలు కోరుతూ లేఖ రాసి విగ్రహాన్ని తిరిగిచ్చేశాడు.