రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవైపు లీగ్‌కు వీడ్కోలు పలుకుతామన్న బాధ, మరోవైపు టోర్నీ నుంచి ఆర్‌సీబీ నిష్క్రమణ నిరాశతో కార్తీక్ మైదానం వీడాడు. దినేశ్ కార్తీక్‌కు ఆర్సీబీ ఆటగాళ్లకు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ పెవిలియన్‌కు చేరారు. అయితే డీకే తన రిటైర్మెంట్‌పై అధికారికంగా ఎలా నోట్‌ను రిలీజ్ చేయలేదు. కానీ పరోక్షంగా క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆర్సీబీకి కప్‌ను అందించి ఘనంగా లీగ్‌కు కార్తీక్ గుడ్‌బై చెప్పాలనుకున్నాడు. కానీ రాజస్థాన్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఐపీఎల్-2024లో బెంగళూరు కథ ముగియడంతో అర్ధంతరంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.