HomeసినిమాPrabhas పక్కన చిన్న రోల్​ ఇచ్చినా యాక్ట్ చేస్త

Prabhas పక్కన చిన్న రోల్​ ఇచ్చినా యాక్ట్ చేస్త

బాలీవుడ్​ స్టార్​ రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్​ రెడ్డి వంగా కాంబినేషన్​లో వస్తున్న సినిమా ‘యానిమల్’, ఫాదర్​ సెంటిమెంట్​తో పాటు ఫుల్​ పవర్​ ప్యాక్డ్​ యాక్షన్​ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 1న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్​ రిలీజ్​ కాగా.. ఆడియెన్స్​ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్​లో ట్రెండింగ్​లో ఉంది. సోషల్ మీడియాలోనూ టాప్​లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ కట్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు కూడా వైరల్​గా మారాయి. సందీప్ రెడ్డి వంగా అసలు సిసలైన వయోలెన్స్​ను చూపించారంటూ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రష్మిక మందన్న లేడీ లీడ్ రోల్​లో నటించిన ఈ సినిమాలో అనిల్ కుమార్, బాబీ డియోల్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్​లో భాగంగా మేకర్స్ టాలీవుడ్ ప్రముఖ షో అయిన అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్​కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రోగ్రామ్​లో రణబీర్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్​ షేర్ చేశాడు. సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్​తో స్పిరిట్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఏదైనా చిన్న రోల్ నాకోసం ఉన్నా, చేస్తా అంటూ రణబీర్​ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారుతోంది.

Recent

- Advertisment -spot_img