Health: చికెన్, మటన్ లివర్‌లో పోషకాలు ఉంటాయని.. చాలా మంది చిన్నపిల్లలకు వాటిని తినిపిస్తూ ఉంటారు. అయితే లివర్‌ను చిన్న పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. లివర్‌లో కాడ్మియం, లెడ్ వంటి లోహాలు ఉంటాయి. ఇవి పిల్లల యొక్క నరాల వ్యవస్థపైన, మెదడుపైన తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అంతేగాకుండా చిన్న పిల్లలకు లివర్ తినిపిస్తే మలబద్ధకం, అజీర్ణ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.