ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్ పేషెంట్స్ డైట్ లో కొన్ని ఆహారపదార్థాలు చేర్చుకుంటే పరిస్థితి మరింత మెరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్.. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తుంటారు. లివర్ కణాలలో కొవ్వు అతిగా చేరితే.. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య కి అర టీస్పూన్ మెంతి గింజలు, చిటికెడు పసుపును ఒక గ్లాసుడు నీటిలో వేసి మరిగించాలి. తర్వాత చల్లార్చి ఆ నీటిని తాగాలి. రోజూ ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్యను దూరమయ్యేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుందని తెలుస్తుంది. ఈ డ్రింక్ తో బరువు కూడా సులువుగా తగ్గొచ్చు.