Homeహైదరాబాద్latest NewsHealth: ఇయర్ ఫోన్స్‎ అతిగా వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవ..?

Health: ఇయర్ ఫోన్స్‎ అతిగా వాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవ..?

మారుతున్న కాలంలో ఇయర్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆఫీస్‌కి వెళ్లాలన్నా, పనిమీద బయటకు వెళ్లాలన్నా, చివరకు ఇంట్లో ఉన్నా ఇయర్‌ఫోన్ తప్పనిసరి అయిపోయింది. కానీ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే వినికిడి శక్తి పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు గంటల తరబడి ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని ఫోన్‌లో మాట్లాడుతూ, పాటలు వింటారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. దీని వల్ల చికాకు, తలనొప్పితో పాటు వినికిడి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
60 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని నేరుగా వినడం ఎవరికీ మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. 70 నుంచి 80 డెసిబుల్స్ మధ్య శబ్దాన్ని నిరంతరం వినడం వల్ల చెవుడు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలకు 20 సార్లు 20 నిమిషాల పాటు 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ వింటే వినికిడి లోపంకి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్ల నుంచి వచ్చే శబ్దం కర్ణభేరికి దగ్గరగా ఉంటుంది. ఈ శబ్దం ఎక్కువ అయినప్పుడు కర్ణభేరికి శాశ్వత నష్టం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img