Health: జ్వరానికి లేదా చిన్నచిన్న శరీర నొప్పులకు పారాసిటమాల్ మాత్రలను వినియోగిస్తుంటారు. అయితే అదేపనిగా ఈ మాత్రను వాడితే అనారోగ్య సమస్యలతో పాటు శరీర అవయవాలు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎలుకలకు పారాసిటమాల్ ఇస్తూ వాటిలో కలిగే మార్పులను పరిశోధకులు పరిశీలించారు. కాలేయం దెబ్బతిన్నట్టు గుర్తించారు. పారాసిటమాల్ అధికమోతాదులో తీసుకునే రోగుల్లోనూ ఇదే ఫలితం కనిపిస్తుందని హెచ్చరించారు.