వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. నీళ్లు, బ్రౌన్ రైస్, బార్లీతో గంజి, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీ, రాగి మాల్ట్, కిచిడీ తీసుకోవాలి. ఘన ఆహారాల కంటే ద్రవపదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది శీతల పానీయాలు తీసుకుంటున్నారు… అలా తీసుకోకూడదు.