బెండకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెండకాయతో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో ఉండే పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు ఈ బెండకాయలను తింటే చాలా మంచిది. ఇంకా గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా దోహదపడతాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.