అరటిపండులో ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, సి వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె, ఒక కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాయండి. అరగంట అలాగే ఉంచి మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. తేనె జుట్టును మెరిసేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చుండ్రును తొలగిస్తుంది.