పెసరపప్పులో గ్లైసెమిక్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు చక్కెరను త్వరగా నియంత్రిస్తాయి. పెసరపప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ వంటి సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి ఈ పప్పు ఉపయోగపడుతుంది. పెసర పప్పు నీరు బలహీనతను తొలగిస్తుంది. ఖిచ్డీ తయారీకి కూడా పెసరపప్పును ఉపయోగించవచ్చు.