ఒక్కోసారి మనకు తెలియకుండానే ఉదయాన్నే కొన్ని రకాల డ్రింక్స్ తాగుతాం. ఇవి ఆరోగ్యానికి(Health) చాలా హానికరం చేస్తాయి. నిజానికి ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవాలి. ఇది మనల్ని రోజంతా శక్తివంతంగా మరియు చురుకుగా చేస్తుంది. దీని కోసం మంచి ఆహారం పాటించాలి. కానీ కొన్ని రకాల పానీయాలు ఉదయాన్నే తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.
- ఉదయం సోడా లేదా ఏదైనా కార్బోనేటేడ్ పానీయాలు తాగడం మంచిదికాదు. ఇది అధిక మొత్తంలో చక్కెర మరియు కెఫిన్ కలిగి ఉంటుంది. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత మీరు అలసిపోతారు.
- ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్ మరియు షుగర్ ఉంటాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీంతో రోజంతా శక్తి లేకపోవడం వల్ల అలసటగా అనిపిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ హార్ట్ బీట్, రక్తపోటును పెంచుతాయి ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.
- పొద్దున్నే టీ, కాఫీలు తాగడం మామూలే కానీ వాటిలో చక్కెర ఎక్కువగా తాగకూడదు. ఇది ఆరోగ్యానికి హానికరం. అధిక చక్కెర వినియోగం బరువు పెరగడం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు చక్కెర లేకుండా టీ లేదా బ్లాక్ కాఫీ తాగితే పర్వాలేదు.
- అలాగే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఈ జ్యూస్ లో ఫైబర్ ఉండదు. ప్రాసెసింగ్ సమయంలో పోషకాలు నాశనమవుతాయి. అందువల్ల తాజా పండ్లను తీసుకోవడం ఉత్తమం.