తాజా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే చాలామందికి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ కొన్ని పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చకాయ, దోస, జామ వంటి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే పండ్లు తిన్న తర్వాత ఓ 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాటర్ పుచ్చుకోవడమే మంచిదంటున్నారు.