Homeహైదరాబాద్latest NewsHealth: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!

Health: ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!

ప్రస్తుతం చాలా మంది మొబైల్‌కు బానిసలయ్యారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు గంటల తరబడి ఫోన్‌లోనే గడుపుతున్నారు. సోషల్ మీడియా ప్రపంచం గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. ఉదయం లేవగానే ఫోన్‌లో ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్‌లు చెక్ చేస్తూ గంటపాటు ఫోన్‏లో గడిపేస్తారు. అయితే ఉదయం నిద్రలేవగానే ఫోన్‌ని చూస్తే మానసిక క్షోభ కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి, మెడ నొప్పి, చేతి నొప్పులు వంటి సమస్యలు పెరుగుతాయి. నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే ఫోన్ వైపు చూసే అలవాటు మానుకోవాలి. అలాగే నిద్రలేవగానే ఫోన్ వైపు చూడటం వల్ల ఏకాగ్రత లోపించడం, తల బరువుగా ఉండడం, సరిగ్గా ఆలోచించలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే క్రమంగా రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img