Homeహైదరాబాద్latest NewsHealth: వర్షంలో తడిచారా? తడిచిన బట్టలతో ఎక్కువ సేపు ఉంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..?

Health: వర్షంలో తడిచారా? తడిచిన బట్టలతో ఎక్కువ సేపు ఉంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..?

ప్రస్తుతం వర్షకాలం కావడంతో.. ఎక్కడ చూసిన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఎప్పుడు వర్షం పడుతుందో అనేది ఎవరికి తెలియదు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీస్, స్కూల్స్, బయట పనులకు వెళ్లి, వచ్చినవారు.. వర్షానికి తడిచే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి వర్షంలో తడవడం ఇష్టం. వర్షంలో తడిచిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. వర్షంలో తడిస్తే వీలైనంత త్వరగా తలను శుభ్రం చేసుకోవాలి. తడిచిన దుస్తులతో ఎక్కువ సేపు ఉండకూడదు. జలుబు, జ్వరం, చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం తర్వాత ఏసీ, ఫ్యాన్ ఆన్ చేయకుండా కొద్ది సేపు సాధారణ వాతావరణంలో ఉండాలి. తర్వాత హెర్చల్ టీ తాగడం మంచిది.

Recent

- Advertisment -spot_img