హాయిగా నిద్ర పట్టాలంటే రాత్రి పడుకునే ముందు ఇవి తినండి. మెగ్నీషియం ఎక్కువగా ఉండే బచ్చలికూర, బాదంపప్పులను రోజూ రాత్రిపూట తింటే హాయిగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించడంలో తులసి ఆకులు ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా జీడిపప్పు, వాల్ నట్స్ తీసుకోవాలి. క్రమం తప్పకుండా చెర్రీస్ మరియు ఓట్స్ తీసుకోవడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది.