పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం 3 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎన్డీఏ సర్కార్ మూడు రెట్లు వేగంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. త్వరలో భారత్ ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని వెల్లడించారు.
70 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా:
పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వృద్ధులకు శుభవార్త చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తోందని తెలిపారు. అలాగే అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
మూడు రెట్ల వేగంతో ప్రభుత్వం పని చేస్తోంది
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ‘బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యత ఉంటుంది. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ప్రభుత్వం మూడు రెట్లు వేగంతో పని చేస్తోంది.’ అని రాష్ట్రపతి అన్నారు.