Homeహైదరాబాద్latest NewsHealth: రాత్రంతా సరిగా నిద్ర పట్టడం లేదా? ఇలా చేయండి..

Health: రాత్రంతా సరిగా నిద్ర పట్టడం లేదా? ఇలా చేయండి..

ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రి గంటల తరబడి మంచంపై పడుకున్నా నిద్ర పట్టదు. మీరు కూడా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే, ఈ చిట్కాలతో వేగంగా నిద్రపోండి.

  1. పడుకోవడానికి అరగంట ముందు టీవీ, ఫోన్లను పక్కన పెట్టేయండి.
  2. రోజూ ఒకే సమయానికి నిద్ర పోండి. కొన్నిరోజులకు అది అలవాటులా మారుతుంది.
  3. మైండ్ అంతా ఆలోచనలతో నిండిపోతే నిద్ర తొందరగా రాదు. పడుకొని దీర్ఘశ్వాస తీసుకుంటూ నిద్రపైనే దృష్టి నిలపండి. ఆక్సిజన్‌ సరఫరా బాగా జరిగి ఒత్తిడి దూరమై నిద్రలోకి జారుకుంటారు.
  4. గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగాలి. లేదా చామంతి టీని తాగండి. ఇవి నరాలను శాంత పరిచి, నిద్రపట్టేలా చేస్తాయి.
  5. తినడానికి, పడుకోవడానికి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. త్వరగా డిన్నర్ చేసి, కాసేపు నడిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

Recent

- Advertisment -spot_img