TG : రాష్ట్రంలో ప్రజటందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆధార్ కార్డు తరహాలో ఒక్కో వ్యక్తికి స్మార్ట్ కార్డు ఇస్తామన్నారు. పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య వివరాలు తెలిసేలా రూపకల్పన చేస్తామన్నారు. ఏ డాక్టర్‌ను సంప్రదించినా వెంటనే ఆరోగ్యపరిస్థితి తెలుసుకొని వైద్యం చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. జులై నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందన్నారు.