వంటింట్లో వాడే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. కేవలం మసాలాల్లో ఉపయోగించే దాల్చిన చెక్కను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తూంటారు. అంతేకాదు దాల్చిన చెక్కలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నయం చేసే గుణాలు కూడా ఎన్నో ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని నిరోధిస్తాయని, ఫలితంగా ప్రొస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుందని తెలిపారు.