Health Tips: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం కొన్ని చిన్న అలవాట్ల మీ జీవితంలో పెద్ద మార్పులు తెస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- ప్రతిరోజు నడవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- మంచి నిద్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ప్రతిరోజు అరగంట సేపు ఎండలో కూర్చుంటే విటమిన్ డి అందుతుంది మరియు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
- నేల లేదా గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- మొబైల్ లేదా టీవీ స్క్రీన్ చూడటం తగ్గించడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- ప్రాసెస్ చేయని ఆహారాలు, కూరగాయలు, పండ్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి.
- ప్రతిరోజు రెండు మూడు లీటర్ల నీరు త్రాగాలి దీనివలన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- లోతైన శ్వాస మరియు మైండ్ ఫుల్ ఎక్సర్సైజ్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
మీ ఇష్టాలను అభిరుచులుగా మార్చుకొని కొత్త విషయాలపై దృష్టి పెట్టండి. చివరగా సెల్ఫ్ లవ్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది.