Healthy Chicken Salad burn fat : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే సలాడ్స్‌ను తరచూ తీసుకోవాలని న్యూట్రిషియన్లు చెబుతున్నారు.
ఫైబర్ అధికంగా కలిగిన సలాడ్స్ తీసుకుంటే జీవక్రియల వేగం పెరగడంతో ఇవి అధిక బరువును నియంత్రిస్తాయి.
పోషకాలు నిండిన చికెన్‌ను రోజూ తీసుకుంటే శరీరానికి మేలు కలుగుతుంది.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు రోజూ చికెన్ సలాడ్ తింటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు.
శరీర నిర్మాణానికి కీలకమైన ప్రొటీన్ అధికంగా ఉండే చికెన్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
చికెన్‌తో పాటు పండ్లు, కూరగాయలను కలిపి సలాడ్‌లా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
తక్కువ క్యాలరీలు కలిగిన లీన్ మీట్ చికెన్‌లో ప్రొటీన్ అధికంగా ఉన్నందున దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సమర్ధంగా నిర్వహించాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.
హెల్ధీ ఫ్యాట్స్ మెండుగా ఉన్న చికెన్‌తో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంతో పాటు ఇందులో ఉన్న ప్రొటీన్లతో శక్తి సమకూరుతుంది.
ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి.
చికెన్ సలాడ్‌లో వాడే ఆకుకూరలు, చికెన్, స్ర్పౌట్స్, టొమాటోలతో పుష్కలంగా ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ కే, ఇతర సూక్ష్మ పోషకాలు తగినంతగా లభిస్తాయి.