Homeలైఫ్‌స్టైల్‌Healthy Food : ఇవి తింటే బాగా నిద్రపడుతుంది.. మంచి ఆరోగ్యం కూడా..!

Healthy Food : ఇవి తింటే బాగా నిద్రపడుతుంది.. మంచి ఆరోగ్యం కూడా..!

Healthy Food : ఇవి తింటే బాగా నిద్రపడుతుంది.. మంచి ఆరోగ్యం కూడా..!

Healthy Food : మారుతున్న జీవనశైలి, ఉద్యోగాలు, వ్యాపార ఒత్తిళ్లు, ఇతర సమస్యలతో చాలా మందిని నిద్రలేమి పట్టి పీడిస్తోంది.

ఈ నిద్రలేమి సమస్య కారణంగా శరీరంలో మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇది చివరికి మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులకూ దారి తీస్తోంది.

ఇలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కొంత వరకు నిద్ర లేమి సమస్య నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మనం ఏం తింటున్నామన్నది మన నిద్ర మీద ప్రభావం చూపుతుందని.. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని, మూడ్ తోపాటు మన నిద్ర సమయాన్ని పెంచుతాయని స్పష్టం చేస్తున్నారు.

రోజూ వ్యాయామం చేయడం, రాత్రి సరైన సమయానికి నిద్రపోవడం వంటి అలవాట్లతోపాటు ఆహార పదార్థాలపై దృష్టి పెట్టడం ద్వారా సరైన నిద్రను పొందేందుకు అవకాశం ఉంటుంది.

అవేమిటి, ఎలా తీసుకోవాలన్నది నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటివి కేవలం నిద్రపోయే ముందే తినాలని ఏమీ లేదని.. రోజులో ఏ సమయంలో తీసుకున్నా కూడా ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.

మరి ఏమిటా ఆహార పదార్థాలు చూద్దామా?

నట్స్ (డ్రై ఫ్రూట్స్)

శరీర ఆరోగ్యానికి సంబంధించి అన్ని రకాలుగా మేలు చేసేవి డ్రై ఫ్రూట్స్. ముఖ్యంగా వాల్ నట్స్, బాదం మంచి నిద్రకు తోడ్పడతాయి.

ఈ తరహా గింజల్లో ‘ట్రైప్టోఫాన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ మంచి నిద్రకు ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గడ్డి చామంతి లేదా సీమ చామంతి టీ

నిజానికి టీ, కాఫీ ఏదైనా నిద్రకు శత్రువులుగా చెప్పొచ్చు.

వాటిలో ఉండే కెఫీన్ అనే రసాయనమే దీనికి కారణం.

అయితే గడ్డి చామంతి లేదా సీమ చామంతిగా పిలిచే ‘చమోమైల్’ టీ మాత్రం నిద్రకు బాగా ఉపకరిస్తుంది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

చమోమైల్ టీని రోజూ రాత్రి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి గింజలు

సూపర్ ఫుడ్ కేటగిరీలోకి చాలా రకాల గింజలు వచ్చినా అందులో గుమ్మడి గింజలు ఎంతో స్పెషల్.

వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర బాగా పోవడానికి తోడ్పడుతుంది.

కివీ పండ్లు

శరీరాన్ని ఉత్సాహంగా, సంతోషంగా ఉంచే హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తికి కివీ పండ్లు దోహదం చేస్తాయి.

కివీలలో ఎక్కువగా ఉండే సెరటోనిన్ మన శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

ఇది మంచి నిద్రకు కారణమవుతుంది.

పెరుగు

మంచి నిద్రకు తోడ్పడే ఆహార పదార్థాల్లో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి పెరుగు తోడ్పడుతుంది.

దానికితోడు విటమిన్ బీ12, కాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలూ ఉంటాయి.

ఇవన్నీ కూడా మంచి నిద్రకు సహకరిస్తాయి.

పుట్టగొడుగులు

చాలా మంది పుట్టగొడుగులు అనగానే దూరంగా ఉంటారు.

కానీ వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇవన్నీ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ, గుండె సరిగా పనిచేసేందుకు తోడ్పడతాయని వివరిస్తున్నారు.

ఇదే సమయంలో మంచి నిద్రకూ పనికివస్తాయని అంటున్నారు.

టమాటాలు

టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి మనకు మంచి నిద్ర కలిగేందుకు తోడ్పడే ప్రక్రియలను ప్రేరేపిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

అంతేకాదు.. గుండె సంబంధిత ఆరోగ్యానికి కూడా టమాటాలు దోహదం చేస్తాయని వివరిస్తున్నారు.

బ్రకొలీ

అతి ఎక్కువ పోషకాలు, ఫైబర్ ఉండి తక్కువ కేలరీల శక్తి ఉండే ఆహారంగా బ్రకొలీ ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది.

అయితే బ్రకొలీ మన నిద్రలో ‘రెమ్ (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్)’ అనే దశను మెరుగుపర్చడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

నిద్రలో ఈ ‘రెమ్’ దశ ఎంత బాగుంటే, ఎక్కువ సేపు ఉంటే అంత బాగా నిద్రపోయినట్టు అన్నమాట.

అరటి పండ్లు

అరటి పండ్లలో విటమిన్ బీ తోపాటు పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండూ మంచి నిద్రకు దోహదం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా గురక, మధ్యమధ్యలో ఇబ్బందితో నిద్రలేచే ఇన్సోమ్నియాతో బాధపడుతున్నవారికి అరటిపండ్లు మేలు చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

చేపలు

చేపల్లో ముఖ్యంగా సాల్మన్ రకం చేపల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి శరీరంలో చాలా రకాల జీవ క్రియలు సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతాయి.

ఇది చాలా మందికి బాగా నిద్ర పట్టేందుకు వీలు కలిగిస్తుంది.

Recent

- Advertisment -spot_img