ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అయితే కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ కోర్టులో ఏసీబీ అధికారులు కౌంటరు దాఖలు చేసారు.ఈ క్రమంలో విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసినట్లు న్యాయస్ధానం తెలిపింది. ఈనెల 31 వరకు కేటీఆర్ అరెస్టుపై స్టే పొడిగించారు.